“ఆదిపురుష్” కి రహమాన్ సంగీతం

బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్వకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా, రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా హిందీ, తెలుగు సహా ఐదు భాషల్లో తెరకెక్కబోతోంది.