నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. పది పాసైతే ఉద్యోగాలు..?

రైల్వే శాఖ 374 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీలోగా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు యూపీలోని బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.blwactapprentice.in/ లేదా https://blwactapprentice.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 374

నాన్ ఐటీఐ ఖాళీలు: 74

ఐటీఐ ఖాళీలు 300

నాన్ ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఐటీఐ ఉద్యోగాలలో ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తుకు చివరి తేదీ- 2021  ఫిబ్రవరి 15

విద్యార్హత: పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు, ఐటీఐ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: http://www.blwactapprentice.in/ లేదా https://blwactapprentice.in/