అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో రాజమండ్రి జనసేన

రాజమండ్రి: భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్సు స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.ఆర్. అంబేడ్కర్ గారు భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున బడుగు బలహీన వర్గాలను చట్ట సభల వైపు నడిపించాలి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని తపించారు. ఆ మహనీయునికి రాజమండ్రి నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తూ.గో.జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాజమండ్రి నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథ రావు, సత్యనారాయణ గుత్తుల, ప్రధాన కార్యదర్శి వీరబాబు నల్లంశెట్టి, ధవలేశ్వరం మండల ఉపాధ్యక్షులు మాటపర్తి నాగరాజు, రాజమండ్రి నగర కార్యదర్శులు ప్రకాష్ కప్పల, రాజు అలాటి, వాసు విన్న, సంయుక్త కార్యదర్శి చక్రపాణి ఫణి, నగర నాయకులు సూర్య, ఖాన్, విక్టర్ వాసు, తదితరులు నివాళులర్పించారు.