సర్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు జనసేన సహాయం

  • ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు పూరి గుడిసెలు దగ్ధం
  • బాధితులను పరామర్శించి, అన్నీ వేళల అండగా ఉంటానని భరోసా కల్పించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ కోనపాయిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మరొక మత్స్యకార కుటుంబం జీవనదారం అయిన వేట కు ఉపయోగించే వల కూడా కాలిపోవడంతో సంఘటన స్థలాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సందర్శించి భాదితులను ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకోగా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఇలా సర్వస్వం పోగొట్టుకొని కట్టుబట్టలతో ఉన్నామని బాధితులు కన్నీరు మున్నీరుగా కుటుంబీకుల ఆర్తనాదాలు విలపించారు, ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రమాదంలో అన్ని పోగొట్టుకొని అల్లాడుతున్న వారికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు. స్థానిక మత్స్యకార కుటుంబాలకు తరుచుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరాశ్రయులైన రెండు కుటుంబాల మాతృమూర్తిలయిన బడే రత్నం మరియు దుమ్ము అప్పలనర్సమ్మ గార్లకు నిత్యావసర సరుకులుతో పాటుగా 5000 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. అనంతరం స్థానికంగా ఉన్న రెండు గుడిసెలు మంటలు అంటుకోవడం వలన పక్కనే ఉన్న మరొక కుటుంబఆధారం అయిన వేటకు ఉపయోగించే వల కూడా పూర్తిగా కాలిపోవడంతో జనసేన నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న అనంతరం స్థానిక నాయకులతో బాధితుల పక్షాన అన్ని విధాలుగా అండగా ఉండాలని వారి బాగోగులు దృష్ట్యా ఏ అవసరం అయిన మరొకసారి రావడానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా, అందరికి అందుబాటులో ఉంటాను అని తెలియజేసారు.