రాజంపేట జనసేన ఆత్మీయ సమావేశం

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ స్థాయిలో జనసేనపార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ ఐటి విభాగం కో-ఆర్డినేటర్ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు, నాయకులు, జనసైనికుల ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును ఉద్దేశించి రాజంపేట అసంబ్లీ నుంచి గెలుపే లక్షంగా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అనుగుణంగా ఆరు మండలాల నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ అభివృధ్ధి కోసం సమాయత్తం అయ్యి ఉత్సాహవంతులను ప్రోత్సహిస్తూ, సమస్యల పట్ల భాదితులకు పార్టీ తరపున అండగా నిలబడి భరోసా కల్పించడంతో పాటుగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిస్తూ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.