రజినీకాంత్ సెన్సేషనల్ డెసిషన్..!!

ఇటీవల  సూపర్ స్టార్ రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వెళ్లడం భగవంతుడికి ఇష్టం లేదని అభిమానులకు మూడు పేజీల లేఖ రాస్తూ రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కొన్ని రోజులపాటు రజినీకాంత్ అభిమాన సంఘాలు మరికొంతమంది ఆందోళనలు నిరసనలు చేపట్టగా, అన్నిటికంటే ఆయన ఆరోగ్యం ముఖ్యమని చాలామంది స్టేట్మెంట్ ఇవ్వడంతో అభిమానుల కొద్దిగా చల్లబడ్డారు.

మరోపక్క రజిని వెనకడుగు వేయడంతో తమిళ రాజకీయాల్లో చాలా రాజకీయ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు రజిని. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ పార్టీ పెట్టాలని భావించిన సమయంలో అండగా నిలబడ్డారు అర్జున్ మూర్తి. ఈ క్రమంలో ఆయన తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు రజిని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అర్జున మూర్తి గతంలో బిజెపి పార్టీకి పని చేయడం జరిగింది. ఆ తర్వాత రజనీ కొత్త పార్టీ వ్యవహారాలు అన్నీ దగ్గరుండి చూసుకుని సరిగ్గా పార్టీ పెట్టే టైం లో రజినీ అనారోగ్యానికి గురికావడంతో .. ఆయన నిర్ణయం మార్చుకోవడంతో ఇప్పుడు ఏకంగా అర్జున్ మూర్తియే కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే అర్జున్ మూర్తి పనితనం బాగా నచ్చడంతో అతనికి సపోర్ట్ చేయాలని రజనీ డిసైడ్ అయినట్లు తమిళ రాజకీయాల్లో టాక్. రజనీ రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటన తర్వాత బీజేపీ అదేవిధంగా కమల్ హాసన్ తనకు సపోర్ట్ చేయాలని ముందుకు వచ్చినా వారందరిని పక్కనపెట్టి అర్జున్ మూర్తికి సపోర్ట్ ఇవ్వటానికి రజిని తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.