ఘనంగా ప్రారంభం అయిన రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలు

ఎమ్మిగనూరు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ 36 వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో రాహుల్ సాగర్ స్థానిక వేదాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు 30 మంది వరకు అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి కి తగిన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని ఆయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోవాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రమేష్, గురు, శివ తదితరులు పాల్గొన్నారు.