నిత్యవసర ధరల పెరుగుదలతో సామాన్యులు బ్రతికేదెలా

  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు గురువారం 24వ డివిజన్ లోని నవోదయ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఈ వైకాపా ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లేక పెరుగుతున్న నిత్యావసర వస్తువులను కొనలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గత ప్రభుత్వ హాయంతో పోల్చితే ప్రస్తుత వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని దీనికి తోడు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం అందిల్చాల్సిన బ్యాల్లు, చక్కర మొదలగు నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించకుండా కేవలం బియ్యం మాత్రమే అరకొరగా ఇస్తు.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటూ.. దయచేసి ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీరమహిళలు గురు లక్ష్మి, గాయత్రి, సానియా, అసీద్, సురేఖ, అంజలి, జమున, కాంతమ్మ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.