ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుక

రాజానగరం, మార్చ్ 27 న గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సీతానగరంలో గీతా బాలాజీ థియేటర్ నందు రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఆరంజ్ చిత్రం ప్రదర్శింపబడింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు జన సైనికులు మరియు అభిమానులు ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హాజరవడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేసి రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానుల మధ్య కోలాహాలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, కిమిడి శ్రీరామ్, నాతిపాం దొరబాబు, మాదారపు సత్తిబాబు, ప్రశాంత్ చౌదరి, మాదారపు వీరభద్రరావు, శ్రీహరి, నండూరి రాజేంద్ర, రుద్రం నాగు, నండూరి సురేష్, శివ, గ్రంధి వివేక్, అడప నరసింహం, చైతన్య, కొందాటి అనిల్, సన్నీ, రౌద్రం కిషోర్, బొగ్గులంక రాజు, మిర్తిపాడు ప్రసాద్ మరియు ఇతర నాయకులు, జనసైనికులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.