కాగిత శివ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన యడ్లపల్లి రామ్ సుధీర్

• పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయం
• ఇటీవల నడుపూరు సెంటర్లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శివరామకృష్ణ

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, పెడన మండలం కొంకేపూడి గ్రామానికి చెందిన కాగిత శివ రామకృష్ణ ఆటో డ్రైవర్ గా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నడుపూరు సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి మరణించారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ కొంకేపూడి గ్రామంలోని కాగిత శివ రామకృష్ణ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. ఇప్పటికైన ప్రమాదానికి గల కారణాలు కనుగొని నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగిత శివ రామ కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, చెన్ను శివ కొండ, తాత బాలు, తాత శివ, సింగంసెట్టి అశోక్ కుమార్, కొఠారి మల్లిబాబు, నందం శివ స్వామి, పవన్ స్థానిక జనసైకులు పాల్గొన్నారు.