మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యల మీద మండిపడిన యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వరుస ట్వీట్లకు వైసీపీ మంత్రులు జనసేనానిని విమర్శించడంతో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అలజడి మొదలయ్యిందని, పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిన అన్ని సమస్యలు మంత్రి జోగి రమేష్ వైపే వేలెత్తి చూపాయి.. అందుకే అంత ఆక్రోశం అని అన్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ
• పెడన నియోజకవర్గంలో కౌలు రైతుల్ని గాలికి వదిలేశారు. రహదారులు గోతులు మయంగా మారాయి. స్కూళ్లు మూసేశారు. మడ అడవులు మాయం చేశారు. మట్టి దోచేశారు.
• పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమల్ని సంక్షోభంలోకి నెట్టారు.
• రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి. మంత్రి కూడా అయ్యి నియోజకవర్గానికి జోగి రమేష్ భారంగా మారారు
• పెడన నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడు జోగి రమేష్
• మంత్రిగా ఏనాడైనా నియోజకవర్గ ప్రజల సమస్యలు, కష్టాల గురించి మాట్లాడారా? రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడారా? పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికే మీకు మంత్రి పదవి ఇచ్చారా?
• మిమ్మల్ని అసమర్ధ మంత్రిగా పెడన ప్రజలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారం చూపలేకపోయారు
• నియోజకవర్గ ప్రజలు సముద్రపునీరు తాగుతున్న దుస్థితి మంత్రి కంటికి కనబడడం లేదు.
• నియోజకవర్గంలో కృత్తివెన్ను మండలం శీతనపల్లి మరియు పరిసాల దిబ్బ గ్రామాల్లోని మహిళలు మా ఊరు రోడ్ల సమస్యను పరిష్కరించమని మీడియా ముఖంగా అడిగినా మీ చెవులకు వినపడదు
• బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి హుందాగా వ్యవహరించడం చేతకాదు
• నువ్వు శపథం చేసిన 100 పడకల ఆసుపత్రి ఏమయ్యింది. సమస్యలు పరిష్కరించలేని దద్దమ్మ మంత్రి అని ప్రజలు చెప్పుకుంటున్నారు
• పెడన నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్నది 60:40 బంధం. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి అక్రమాల మీద చేసిన విమర్శలు ఏమయ్యాయి. అధికారంలోకి వచ్చాక ఎందుకు వాటిని నిరూపించలేకపోయారు
• ఆ ఇద్దరు నేతలది బాబాయ్ – అబ్బాయ్ ల సంబంధం
• బాబాయ్ – అబ్బాయ్ ల బంధంతో నడుస్తున్న రాజకీయాల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు
• జనసేన పార్టీ కేవలం ప్రజల కోసం పుట్టిన పార్టీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిబద్దతతో పనిచేస్తుంది.
• రాష్ట్రంలో నిబద్దతతో కూడిన రాజకీయాలు చేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. నిరంతరం ప్రజా సమస్యల పట్ల నిజాయితీతో కూడిన పోరాటం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్.
• ప్రజల్లో ఆయనకున్న బలాన్ని చూసి భయపడే మంత్రులు పిచ్చికుక్కల మాదిరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.
• మీకు రోజులు దగ్గర పడ్డాయన్న సంగతి గుర్తు పెట్టుకోండి
• బాబాయ్ – అబ్బాయ్ లకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయం.. జనసేన పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. రాష్ట్ర ప్రజల మద్దతుతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.