టి.సుండుపల్లి మండల అధికారులకు వినతిపత్రాలు అందజేసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో టి.సుండుపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బస్టాండ్ సమీపంలో గానీ, నాలుగు రోడ్ల కూడలి నందు, ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, ప్రయాణికులు, వ్యాపారస్తులు, తోపుడుబండ్లు వారు ఎక్కువ మంది ప్రజలు, పీలేరు, రాయచోటి, సానిపాయి, వీరబల్లి, రాజంపేట, రాయవరం,పింఛ, తిరుపతి మొదలగు ఊర్లకు ఎక్కువ మంది ప్రయాణం సాగిస్తూ… బస్సులు సరైన సమయానికి రాకపోవడం వలన ప్రజలు వారి జీవనోపాధి కొరకు, వ్యాపారం కొరకు చదువుల కొరకు, వైద్యం కొరకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చి పోయే వారికి కనీసం మరుగుదొడ్లు (పబ్లిక్ టాయిలెట్స్) లేక ఆడవారు, మరియు మగవారు, పిల్లలు, యువకులు, వృద్ధులు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నాగరికత పెరిగేకొద్దీ కనీస అవసరాలు లేని టి. సుండుపల్లి ప్రజలకు అత్యంత ప్రాధాన్యత గల సౌకర్యం లేకపోవడం గమనించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ప్రజా సమస్యలు తక్షణమే పరిగణనలోకి తీసుకుని ప్రజలకు అనుకులంగా ఉండే విదంగా పరిశీలించి వీలైనంత త్వరగా మరుగుదొడ్లు నిర్మించి ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరిగింది.