డి.ఎస్.పి కె.ఎన్.వి చైతన్యని మర్యాదపూర్వకంగా కలిసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట డివిషన్ డి.ఎస్.పి గా నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కె.ఎన్.వి చైతన్యని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల, పేద ప్రజలకు మరియు సమస్యలు పట్ల సంబంధిత భాదితులకు న్యాయం జరిగేలా మీ సర్వీసులు అందుబాటులో ఉండాలని కోరుతూ కుళ్ళు, కుతంత్ర రాజకీయాలకు అతీతంగా న్యాయబద్ధంగా మీ సేవలు రాజంపేట డివిషన్ ప్రజలందరికీ క్షేత్ర స్థాయిలో అందించాలని కోరడంతో ఆయన మానవతాదృక్పదంతో ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా చుస్తానన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడపజిల్లా జనసేన లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బారాయుడు, సీనియర్ నాయకులు కుటాల వెంకటయ్య, కాపు సంక్షేమ యువసేన లీడర్ అబ్బిగారి గోపాల్, యువ నాయకులు పసుపులేటి నరేష్, జనసైనికులు పాల్గొన్నారు.