జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసిన రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను శుక్రవారం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి, సుండుపల్లి బస్టాండ్ నందు ప్రయాణికులకు బస్సు షెల్టర్ వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. ఈ సమస్య పై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే పరిశీలించి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.