2024లో పవన్ కళ్యాణ్ ను సిఎంగా చేసేందుకు కృషిచేయాలి:గూడూరు వెంకటేశ్వర్లు

వెంకటగిరి, రాబోయే 2024 లో పవన్ కళ్యాణ్ ను సిఎంగా చేసి జనసేన జెండా అమరావతిలో ఎగిరేలా ప్రతి మండలంలో పార్టీ ని ప్రతి మండలంలో క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్ళాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి ఇన్ ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు అన్నారు. వెంకటగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం కొత్తగా మండలాల అధ్యక్షులుగా పార్టీ నిర్ణయించిన నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ ఈ సమావేశంలో పాల్గొని నాయకులకు జనసేన బలోపేతం పై ఇప్పటి నుండి కృషి చేయాలన్నారు. అనంతరం వెంకటగిరి ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీని ప్రతి గ్రామంలో బలపడేలా జనసేన నాయకులు కార్యక్రమాలు చేయాలన్నారు. గ్రామస్థాయిలో అధ్యక్షులను బూత్ కమిటీలు ఏర్పాటుకు జనసేన పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే ఆరు మండలాల్లో మండల అధ్యక్షులను ఏర్పాటు చేసిందని అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకునే కార్యవర్గాలను ఏర్పాటు చేసి 14 తేదీ లోపు ప్రకటించనుందన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్త గట్టిగా పార్టీ కోసం పని చేసి గుర్తింపును తెచ్చుకొని జిల్లా రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు దక్కించుకోవాలన్నారు. ఈ సందర్బంగా ఐదు మండలాల అధ్యక్షులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాబోయే 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ ను సిఎంగా చూడాలని కృతనిశ్చయముతో పని చేయాలని కొత్తగా ఏర్పాటైన మండలాల పార్టీ అధ్యక్షులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గములోని మండలాలకొత్త అధ్యక్షులను సైదాపురం-మగ్గం నవీన్ కుమార్, రాపూరు-పొట్టేళ్ళ పెంచలయ్య, బాలాయపల్లి-పగడాల వెంకటరమణ, డక్కిలి-తిరుపతి ఈశ్వరయ్య, వెంకటగిరి రూరల్-గుగ్గిళ్ళ నాగరాజులను జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ కు పరిచయం చేశారు. ఈ సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ, సంయుక్త కార్యదర్శి రాజేష్, రాపూరు జనసేన నాయకులు బెల్లం అంకయ్య, చింతలపల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.