షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేదలకు రంజాన్ తోఫా

పొన్నూరు నియోజకవర్గం, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం గాదె మాట్లాడుతూ… ఎవరికైనా సహాయం చేయాలంటే మనసుండాలి ఈ యొక్క పండగ సందర్భంలో తనకు ఉన్న దానిలో నుంచి ఇతరులకు కొంత సహాయం చేయాలని ఆలోచన చేసిన పట్టణ అధ్యక్షుడు కరీముల్లాకి దేవుడు మరింత శక్తిని ఇచ్చి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని ఆ అల్లా ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నాయకులు, పొన్నూరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.