బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పవనన్న షణ్ముఖ వ్యూహం

  • పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 7వ రోజున వెంకట్రావుపల్లిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ రూపొందించిన షణ్ముఖ వ్యూహాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, పవనన్న ప్రభుత్వంలో షణ్ముఖ వ్యూహంలోని ప్రణాళికలు అమలుపరుస్తాం అని అన్నారు. యువతకు రుణ సాయం, మహిళలకు భద్రత, రైతులకు భరోసా షణ్ముఖ వ్యూహంలో ముఖ్య అంశాలని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడం, విద్యావ్యవస్థలో సంస్కరణల ప్రణాళికలను పవన్ కళ్యాణ్ రూపొందిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరు పవన్ కళ్యాణ్ కి అండగా నిలవాలని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు చంద్ర, వంశీ, సురేష్, ప్రసాద్, అరవింద్, అనిల్, నాగరాజు, భాను కిరణ్, తిరుమల, పవన్, శ్రీహరి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.