కేతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన రాందాస్ చౌదరి

మదనపల్లి కమ్మవీధి జనసేన పార్టీ కార్యలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉన్న కేతంరెడ్డి ఈరోజు వైసీపీ సండువా కప్పుకొని వైసీపీ పార్టీలో చేరీ చేరగానే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల రుసుముపై విమర్శలు చేయడం అసలు నీది మానవ జన్మ ఏనా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మా పార్టీ సిద్ధాంతాలను విమర్శించడం మదనపల్లి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. నువ్వేంత నీ స్థాయి ఎంత? నువ్వు ముందు మదనపల్లి కూడా వచ్చి అభ్యర్థులను ప్రకటించేసి వెళ్లావని ఇప్పటికి అయినా నువ్వు సన్మార్గంలో వెళ్లి ఎదిగితే మా పూర్వ మిత్రుడిగా మేము కూడా సంతోషిస్తామని అన్నారు. నువ్వు వైసీపీలో చేరితే నీకు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఎమ్మెల్యే సీట్ కాదు కదా బస్సు టికెట్, రైలు టికెట్ కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వరని, ఇప్పటికైనా కేతంరెడ్డి వినోద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మంచి మార్గంలో నడవాలని మేము ఆశిస్తున్నామని అన్నారు. రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక అయిన జగన్మోహన్ రాజుని అభినందిస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశామిచ్చారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త మదనపల్లి ధ్యేయంగా జనసేన-టీడీపీ శ్రేణులు కలసి కట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, చంద్రశేఖర, కుమార్, నవాజ్, జనార్దన్, జంగాల గౌతమ్, జయ, గండికోట లోకేష్, నారాయణ స్వామి, లవన్న, ప్రసాద్, అర్జున, శంకర, విజయ్ కుమార్, గంగులప్ప నరేంద్ర, నరేష్, తేజ, జక్కెపల్లి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.