రాంగోపాల్ వర్మా.. నీ వల్ల సమాజానికి ఏమిరా ఉపయోగం?: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ పై స్పందించిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ నీ వల్ల సమాజానికి ఏమి రా ఉపయోగం? సృష్టిలో పుట్టిన ప్రతి జీవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి ఉపయోగపడుతుంది. నిన్ను జంతువులతో పోల్చినా కూడా ఆ జంతువులు బాధపడతాయి. నీ పుట్టుక వల్ల ఈ సృష్టికి ఎటువంటి ఉపయోగం లేదు. నీవు ఒక మానసిక వ్యాధిగ్రస్తుడవు? ఏదో విధంగా కాంట్రవర్సీ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టే నీచుడవు. నీవు కరోనా వైరస్ కంటే డేంజరస్ వైరస్ వి. జఫ్ఫాస్ మీరు సృష్టించిన ఈ రాంగోపాల్ వర్మ అనే వైరస్ ను సమాజం మీదకు రెచ్చగొట్టి వదులుతున్నారు జాగ్రత్త. ఈ వైరస్ మిమ్మల్ని కూడా దహించి వేస్తుంది, ఎలాగంటే కరోనా వైరస్ ను సృష్టించిన దేశం కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. రాంగోపాల్ వర్మ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద ఏదైతే నీవు ట్వీట్స్ చేస్తున్నావో అదే విధంగా పాపం పసివాడైన జగన్ రెడ్డిని కూడా అడగగలవా? వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు?, ఎందుకు చంపారు?, అనతి కాలంలో ఇంత సంపదను ఎలా సృష్టించగలిగావ్?, నీకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?. ఎందుకు నీ మీద ఈడీ కేసులు ఉన్నాయి? సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఎందుకు పరదాలు కట్టుకొని దొంగగా తిరుగుతున్నావు?.. రాంగోపాల్ వర్మ ఏదైనా మంచి పనులు చేసి సంఘానికి ఉపయోగపడు… పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు చేస్తూ బ్రష్టు పట్టిపోకు అని జయరాం రెడ్డి హెహ్చరించారు.