కన్నుల పండుగగా జరిగిన రానా- మిహీకా వివాహ వేడుక

సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం వైభవంగా జరిగింది. శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధువుల మధ్య వారి వివాహం కన్నుల పండుగగా జరిగింది.

రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, సమంత పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే అథితుల హాజరుకు అనుమతి ఉండడంతో వేడుకకు రాలేనివారు ఆన్‌లైన్‌లో వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకకు సంబంధించి వర్చువల్‌ రియాలిటీ వీడియో లింక్‌ను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ విడుదల చేసింది. ఈ లింక్‌ను క్లిక్‌ చేసి మీ మొబైల్‌లో వివాహ వేడుకను తిలకించండి.