తొలి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్టర్ చేయనున్నరష్యా

కరోనా వేగంగా విజృంభిస్తున్న క్రమంలో అన్ని దేశాలూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే… తాము చివరి దశ పరీక్షలను పూర్తిచేసి, వచ్చే బుధవారం ఆగస్ట్ 12న తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది. ”గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌ చేస్తాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం” అని ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ తెలిపారు.