‘ఇస్మార్ట్ శంకర్’ గా రణ్ వీర్

బాలీవుడ్‌ చిత్ర సీమ దర్శక, నిర్మాతలందరూ విజయవంతమైన తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో మన కథల రీమేక్ రైట్స్ కొని అక్కడ సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కూడా చేరింది. రామ్‌ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రo ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ గతంలో ఎప్పుడూ కనిపించని మాస్ అవతారo తో అలరించాడు. కాగా ఈ సినిమాపై బాలీవుడ్‌ బడా హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్‌ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్‌ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని టాక్‌. మరి దర్శకుడు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.