నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు గూగుల్‌ నుండి సర్‌ప్రైజ్ లభించింది. ఈ సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక స్థానం సంపాదించుకున్నారు. నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది. దాని కింద.. ”రష్మిక నేషనల్‌ క్రష్‌ ఆఫ్ ఇండియాగా మారింది. ఆమె ఔట్‌ఫిట్‌లను మేము ఇష్టపడుతాము. కానీ ఇప్పుడు ఆమె రేడియంట్‌ మేకప్‌ లుక్‌ని ఇంకా ఇష్టపడుతున్నాము” అని కామెంట్‌ ఉంది

కన్నడలో ‘కిరిక్ పార్టీ’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బన్నీ-సుక్కు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తోంది. ఈ క్రమంలోనే రష్మికకు గూగుల్‌ సర్‌ప్రైజ్ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.