రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. రాటాల రామయ్య

  • రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి…
  • రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట: రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యమని, గ్రామ గ్రామాన జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 55వ రోజు సోమవారం రాజంపేట మండలంలోని కూచివారిపల్లె పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో పలు గ్రామాలలో జనసేన నాయకులు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన యువనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, పోలిశెట్టి చంగల్ రాయుడు, భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, నరసిహులు వీరాచారి, జడ్డా శిరీష, జనసేన వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.