శ్రీకృష్ణ, శ్రీ మరిడిమాంబ దేవాలయాల అభివృద్ధికి రాయపరెడ్డి కృష్ణ విరాళం

మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం, అప్పలరాజు పురం గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయం, శ్రీ మరిడిమాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిలో భాగంగా నూతన నిర్మాణాలకు మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ రూ. 10,116/- విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురిపల్లి కన్నం నాయుడు, దేముడు నాయుడు, కురచా సత్తిబాబు, డోకల కన్నం నాయుడు మరియు మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న వరస దేవాలయాలకు జనసేన పార్టీ తరఫున నగదు సహాయం అందించడం పట్ల పలువురు వ్యక్తులు రాయపరెడ్డి కృష్ణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.