18 నెలలు చూసిన ఎదురు చూపులు నెల రోజులు చూడలేమా.. తాతంశెట్టి

రైల్వేకోడూరు: అన్నమయ్య డాం వరద బాధితులకు ఒకనెలలో అన్ని సహాయ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్న కలెక్టర్ శ్రీ గిరీష గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలిపారు. రైల్వేకోడూరు జనసేన కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య వరద విలయం జరిగి 18 నెలలు దాటినా ప్రభుత్వ సహాయం ఏమాత్రం లేదని, అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా మాటలు తప్ప చేతల్లో పనులు జరగలేదని, సాక్షాత్తూ సీఎం గారే సందర్శించి 3నెలలో మీ గృహాలు రెడీ అవుతాయి అని చెప్పి వెళ్ళినా ఇంకా గాలి, వానలకు టెంటులో బాధితులు ఉండడం బాధాకరం అని తెలిపారు…విపత్తు జరిగాక హుటాహుటిన గ్రామాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు జనశైనికులు,నాయకులు అని తెలిపారు.. ఈ విషయం తెలియగానే ప్రత్యక్ష పర్యటన కు మా పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేసి, కడప జిల్లా జనసేన పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొని, ఎగువ మందపల్లి,దిగువ మందపల్లి, తోగూరుపేట, పులపపుత్తూరు, దళితవాడ, అత్యధికంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, దాదాపు నలభై లక్షల రూపాయలువిలువ చేసే నిత్యావసర వస్తువులు, బట్టలు, మరియు మెడికల్ కాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించామన్నారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర, మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, రెండు సార్లు నాదెండ్ల మనోహర్ సార్, పర్యటించి అనేక వేదికల మీద, ఫోటోలతో సహా ఇక్కడ ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. పవన్ కళ్యణ్ గారు, జనసేన పార్టీ చొరవతోనే న్యాయం జరుగుతుందని అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు అని తెలిపారు. కనీసం అక్కడ జరిగిన నష్టం, మరియు చనిపోయిన పశుసంపద గణనకూడా పారదర్శకంగా లేదు.. ముఖ్యంగా రైతులు ఇసుక మేటలతో రెండు సంవత్సరాలుగా పంటలు లేక, పండిన ధాన్యము వరదలో కొట్టుకుపోయిన వారికి పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలను ఇవ్వాలి. వరద గ్రామాల ప్రజలకు అత్యుత్తమ ఉచిత ఆరోగ్య సేవలు అందించాలి. పడిపోయిన ప్రతి గృహానికి పరిహారం అందించాలి. జనసేన పార్టీకీ మద్దతు అని మందపల్లి ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. తక్షణమే టెంటు లో ఉన్నవారికి పక్క గృహాలు ప్రభుత్వమే యుద్ధప్రాతిపదికన నిర్మించి ఇవ్వాలి ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు, జోగి నేని మణి, పగడాల వెంకటేష్, ఆలం రమేష్, ముద్దపోలు రామసుబ్బయ్య, పగడాల చంద్ర శేఖర్, బీదం నవీన్ కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు.