రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ఈ కోవిడ్ సమయంలో చాలామంది ప్రాణవాయువు లేక ప్రాణాలు విడుస్తున్నారు.. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు  మంచి మనసుతో తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ బ్యాంకులు ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నాయి.

శనివారం రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికీ చెందిన గిడుగు సూర్యనారాయణ  గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో గిడుగు బ్రహ్మజి గారిని సంప్రదించగా.. బ్రహ్మజి గారు రాజోలు ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో గిడుగు సూర్య నారాయణ గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife