రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.24-8-21,మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం మలికిపురం  గ్రామానికీ చెందిన చిటికినిడి బాలమణి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆక్సిజన్ అవసరం ఏర్పడడంతో ఇంటిపల్లి ఆనందరాజు గారిని సంప్రదించగా.. ఆనందరాజు గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో చిటికిని బాలమణి గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను అందించడం జరిగింది.

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife