రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

  • వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బండారు శ్రీనివాస్

రాజోలు నియోజకవర్గం: రాజోలు జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ పింక్ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాపాక రమేష్ బాబు సౌజన్యంతో,మామిడికుదురు మండలశాఖ మరియు గ్రామశాఖ ఆధ్వర్యంలో మామిడికుదురు డా౹౹ బి ఆర్ అంబేద్కర్ కమ్యూనిటి హాలు నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, మండల మరియు గ్రామ శాఖ అధ్యక్షులు, మామిడికుదురు గ్రామ జనసైనికులు, యువత పాల్గొనడం జరిగింది.