రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ ఫస్ట్ లుక్

మరో పాన్‌ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ప్రస్తుతం ఆయన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కాగా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డార్లింగ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో ‘సలార్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అధికారకంగా ప్రకటించారు. ప్రభాస్ చిత్రానికి సలార్ అనే టైటిల్ ని ఖరారు చేశారు ఆ చిత్ర మేకర్స్. ‘కేజీఎఫ్’ మేకర్స్ నిర్మిస్తున్న ‘సలార్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ది మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ అంటూ రిలీజ్ చేసిన ‘సలార్’ పోస్టర్ లో ప్రభాస్ తుపాకీ మీద చేయి పెట్టి వైలెంట్ గా చూస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. కాగా ప్రభాస్ ‘సలార్’ వరల్డ్ లో 2021జనవరిలో అడుగుపెట్టబోతున్నాడంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రభాస్ మెషిన్ గన్ పట్టుకుని కూర్చుని ఉన్న ఫొటో లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ది మోస్ట్ వయొలెంట్ మనుషుల్లో ఒక వయొలెన్స్ చేసే వ్యక్తిని సలార్’ అని పిలుస్తారన్నట్లు వివరణ కూడా ఇచ్చారు. అర్థమవుతుంది. సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేసి రాధేశ్యామ్ తర్వాత రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.