ఓటు హక్కు వినియోగించుకున్న అళహరి సుధాకర్

కావలి టౌన్ లో జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి అళహరి సుధాకర్ సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతు నేను నా ఓటు వేసి కావలి నియోజకవర్గంలో అన్ని మండలాలు, టౌన్ లో ని పోలింగ్ బూత్ లు సందర్శించి సందర్భంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఓటు ఉన్న ప్రతీ ఒక్కరికీ మీమీ ఓటు హక్కు వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు.