జగనన్న ఇళ్లు – పేదలందరికి కన్నీళ్లు: బాబు పాలూరు

  • పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు స్థలం ఎక్కడుందో తెలియడం లేదని ప్రజల ఆవేదన
  • లబ్ధిదారులు వెంటనే ఇల్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అధికారుల ఒత్తిళ్ళు
  • కొన్ని చోట్ల పేదవారి కంటే, వైసిపి నాయకుల చేతిలోనే ఇంటి స్థలాలు
  • జగనన్న కాలనీల పేరుతో ల్యాండ్ అక్విజిషన్ లో వైసిపి నాయకుల భారీ అవినీతి

బొబ్బిలి: చాలీ చాలని స్థలం, సిమెంట్ రేటు పెరిగింది, ఇనుము రేటు పెరిగింది, లేబర్ కూలి పెరిగింది, ఇటుక రేటు పెరిగింది.. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 1.80 లక్షలతో లబ్ధిదారులను వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలనీ ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుందని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు. ఈ సందర్బంగా బొబ్బిలి ఐటిఐ కోలనీలో వున్న జగనన్న కాలనీ మరియు రామందొరవలసలో వున్న జగనన్న ఇల్లును పరిశీలించారు. ఎక్కడ చూసినా కనీసం సదుపాయాలు లేవని, రోడ్లు నిర్మాణాలు లేవని, డ్రైనేజీ నిర్మాణం లేదని, కరెంట్ స్థంబాలు ఇళ్ల పై నుంచి ఉన్నాయని, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో సదుపాయాలు కల్పించకుండా, లబ్ధిదారులు ఎలా ఇళ్లు కట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ డప్పు కొట్టుకొంటున్న వైసీపీ ప్రభుత్వం వెంటనే ప్రజలకు సౌకర్యంగా వుండే విధంగా సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే జగనన్న కాలనీల పేరుతో కొంతమంది వైసిపి నాయకులు చేసిన అక్రమాల గురుంచి కూడా ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో బొబ్బిలి మండల ఆద్యక్షలు సంచాన గంగాధర్, తెర్లం మండల ఆద్యక్షలు మరడాన రవి, వీరమహిళలు బంటుల్లి దివ్య, గైనేడి రమ్య, నాయకులు ఎందువా సత్యన్నారాయణ, బంటుపల్లి శంకర్ రావు, పళ్లెం రాజ, చీమల సతీస్, పోతల శివ శంకర్, బోన్నాడా గణేష్, రాజ జగన్, మోహన్, చందాక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.