ఏలూరు క్రాంతి మండపంలో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, ఆంద్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని కోరుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు “అమరావతి నుంచి అరసవల్లి” వరకు చేస్తున్న మహా పాదయాత్రలో భాగంగా మంగళవారం ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వారికి మద్దతుగా సంఘీభావం తెలిపిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. అనంతరం 3 రాజధానులు వద్దు ఒక రాజధానే ముద్దు అంటూ రైతులు నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.