ఏలూరులో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు వెయ్యి రోజులుగా చేస్తున్న పోరాటంలో భాగంగా “అమరావతి నుండి అరసవల్లి” వరకు మహా పాదయాత్రగా ఏలూరు చేరుకున్న అమరావతి రైతు సోదరులకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తూ కొత్తూరులో ఘన స్వాగతం పలికిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు..ముఖ్య అతిథులుగా రాఘవయ్య చౌదరి మరియు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ అమరావతి ఉద్యమ ధీరులకు యువశక్తి కూడా అండగా నిలిస్తే అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు. గత సుదీర్ఘ కాలంగా 1000 రోజులకు పైగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చటం కోసం ఒక మంచి రాజధాని నిర్మాణం కోసం ఏ విధమైన స్వార్థం లేకుండా అమరావతి లో భూములు ఇచ్చిన రైతులకు కంటతడి పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వపు నిర్ణయాలను నిరసిస్తూ పాదయాత్రగా వచ్చిన రైతులకు జనసేన పార్టీ నుండి పూర్తిగా మద్దతును తెలియజేస్తున్నాము. ఒక ఇంట్లో ఆడపడుచు కన్నీళ్లు పెడితే ఎలాగైతే అభివృద్ధి చెందదో రాష్ట్రంలో రైతాంగం కన్నీళ్లు పెట్టిన ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడు. ఏకైక రాజధాని అమరావతి కోసం రైతాంగం సుదీర్ఘ పోరాటం చేస్తున్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి కళ్ళు ఉండి చూడలేని ముఖ్యమంత్రి గుడ్డిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 1000 రోజులు పైబడి రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని విశ్వసించి తమ భూములను ఇచ్చిన రైతాంగం ఒక మంచి రాజధాని నిర్మాణం చేయాలని నయా పైసా తీసుకోకుండా రైతాంగం ఇచ్చిన భూముల్లో అమరావతి నిర్మాణం చేయండి. 26 జిల్లాలను అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికేంద్రీకరణ అనేది పరిపాలనలో ఉండాలి కానీ రాజధానిలో కాదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ రాష్ట ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేతకాక ఒక మైండ్ గేమ్ ఆడి కాలయాపన చేస్తున్నారని అన్నారు. బాధ్యతను మరిచిన ఒక చేతకాని ముఖ్యమంత్రిని ఎన్నుకున్న 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఈరోజున బాధపడుతున్నారు. ఒకసారి ఓటు వేసి మోసపోయాం అని రాష్ట్ర ప్రజలు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు విచ్చేసిన అమరావతి రైతు సోదరులకు జనసేన పార్టీ తరపున పూర్తిగా మద్దతును తెలియజేస్తున్నాం. ఈ యొక్క మహా పాదయాత్ర విజయవంతం కావాలని ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని అన్నారు. ఎందరో రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతి. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి అమరావతి ఉద్యమాన్ని స్వీకరించి తక్షణమే అమరావతి నిర్మాణం చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కాటు వేసేందుకు పాము పడగకు ఎదురు నిలిచి పోరాడుతున్న అమరావతి రైతుల ఉక్కు సంకల్పానికి అభినందనలు.‌ ఈ మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతు సోదర సోదరీమణులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నంగా చేసి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా తమ కుటీల స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలని జనసేన పార్టీ తరపున నుండి రెడ్డి అప్పల నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి శ్రావణ్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు వల్లూరి రమేష్, నిమ్మల శ్రీనివాసు, బోండా రాము, బొద్దాపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు, సోషల్ సర్వీస్ మురళి, ములికి శ్రీనివాస్, పొన్నూరి రాము, ఆనంద్, నాని, బుధ్ధా నాగేశ్వరరావు, అన్నవరం, సత్యనారాయణ, రాంబాబు, జగదీష్, బాబి, రవి కుమార్, ఏడుకొండలు, దుర్గారావు, శివ సాయి కోడిదాసు, సురేష్, శివ, వీర మహిళలు గిడుతూరి పద్మ, కావూరి వాణి, సరళ, దుర్గా బి, ఉమా దుర్గా, సుజాత తదితరులు పాల్గొన్నారు.