క్రియాశీలక వాలంటీర్లను గౌరవించుకోవడం మన బాధ్యత: గాదె

ప్రత్తిపాడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రత్తిపాడు నియోజవర్గంలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసిన వాలంటీర్లు అందరిని కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన నియోజవర్గం ప్రత్తిపాడు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇంటింటికి తిరిగి వాలంటీర్లు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో అభినందనీయమని ఈ అనుభవం బూత్ కమిటీ నియమాకాల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లు పాత్ర ఎంతో కీలకమైనదని వారు చేసిన సేవకు గుర్తుగా వారిని సన్మానించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. అలాగే జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రత్తయ్య, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొరపాటి నాగేశ్వరావు, గుంటూరు నగర కార్పొరేటర్లు దాసరి లక్ష్మీ దుర్గ, యర్రం శెట్టి పద్మావతి, మండల అధ్యక్షులు పత్తి భవన్నారాయణ, కొల్లా గోపి, సుదా పిచ్చయ్య, కూనపురెడ్డి గంగాధర్, పావులూరు కోటేశ్వరరావు, తన్నీరు గంగరాజు, జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.