వికలాంగునికి బట్టలు పంపిణీ చేసిన జనసేన రాటాల రామయ్య

రాజంపేట పట్టణంలో ని మండూరు గ్రామం లో నివాసం ఉంటున్న అనిమల వెంకటప్రసాద్ కు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా పేదవాడు కొత్త దుస్తులు ధరించాలనే ఉద్దేశంతో దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదల కోసం తమ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాక శంకరయ్య, చంగలగారి గోపికృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.