అరకు, పాడేరు నియోజకవర్గాల ముఖ్యనేతల సమీక్ష సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య అధ్యక్షతన పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లా ప్రధాన కేంద్రమైన పాడేరు జనసేనపార్టీ ఆఫీస్ లో చేద్దామని అందుకు సంబంధించిన వివిధ అంశాలపై రెండు నియోజకవర్గాల ముఖ్య నాయకులకు బాధ్యతలు నిర్వహణ అప్పజెప్పడం జరిగింది. పార్టీ క్షేత్రస్థాయి గ్రామ పర్యటన చేసి బలోపేత నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేసే ఆలోచన విధానాలతో గ్రామ పర్యటనలు చేయాలని, అలాగే ఈ నెల 10 వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే వారాహి యాత్రపై అరకు, పాడేరు నియోజకవర్గాల నాయకులు పాల్గొనాలని క్షేత్రస్థాయిలో ప్రధాన గిరిజన సమస్యలపై చర్చించి వారాహి యాత్రలో జనసేనాని ప్రస్తావించే అంశాల్లో మన నియోజకవర్గ ప్రధాన సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని రెండు నియోజకవర్గాల ముఖ్యనాయకులందరు ముక్తకంఠంతో తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో అరకు, పాడేరు నియోజకవర్గాల మండల నాయకులు అరకు నియోజకవర్గం నుంచి బలిజ కోటేశ్వరరావు, రామకృష్ణ, కొన్నడి లక్ష్మణ్ రావు, బంగరు రాందాస్, చిరంజీవి, పవన్ కుమార్, పరాధన్ సురేష్, దనేశ్వర్రావు, కోడా చందు, బాబురావు, పాడేరు నియోజకవర్గ గూడెం, చింతపల్లి, జి.మాడుగుల పాడేరు మండల నాయకులు కొయ్యం బాలరాజు, వంతల బుజ్జి బాబు, మసాడి భీమన్న, ముఖ్య నాయకులు కిల్లో రాజన్, ఉల్లి సీతారామ్, అంకిత్, తాంగుల రమేష్, వాడకని వినయ్, తల్లే త్రిమూర్తి, మస్థాన్, శేఖర్, వీరమహిళలు కిటలంగి పద్మ, బొంకుల దివ్యలత, తధ్యతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.