4వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్ష

  • భైంసా పట్టణం లోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట రిలే దీక్ష

తెలంగాణ, భైంసా: అక్రమ లేఅవుట్స్ కు పర్మిషన్ ఇచ్చిన సుంక్ష్మి పంచాయతి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సమస్య పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తామని భైంసా పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బురుగుల రాజు ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించిన రిలే నిరాహారదీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలుపి, ఈ సందర్భంగా ఉపాధి హమి పథకంలో పని చేయకున్న వేరే రాష్ట్రంలో వున్న వారి పేర్ల ను రిజిస్ట్సర్లో నమెదు చేసారు. మైనర్ (వయస్సు) లేకున్న జాబ్ కార్డ్ ఇచ్చి ప్రభుత్వ ఖజానాను దోపిడి చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో ప్రజాప్రతినిది అండ దండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. విరికి సహకరిస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మహేష్ బాబు తెలిపారు.