దేశంలో వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల పెంపు

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావంతో దానితో ముడిప‌డి ఉన్న నిత్యావ‌స‌ర ధ‌ర‌లు కూడా పెరిగిపోతుండ‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న సామాన్యుడిపై వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డుతోంది. దేశంలో ఇప్ప‌టికే కొన్ని నెల‌లుగా ప‌లుసార్లు వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే.

తాజాగా మరోసారి సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. ఈ ధరలు నిన్న‌టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబైలో సిలిండర్ ధర రూ.859.50కు చేరుకుంది. అలాగే, కోల్‌కతాలో రూ.886గా ఉంది. గ‌త నెల 1వ తేదీన కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన విష‌యం తెలిసిందే.