రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి..!: నిమ్మకాయల రాము

జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే సెల్వమణి రోజా గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి మీరు. జనసైనికులని సన్నాసులని.. వెదవలని.. చదువు రాని వాళ్ళని విమర్శిస్తున్నారు. మీరు అలాంటి వాళ్ళందరూ ఉన్నది మీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లక్షల్లో పారితోషకం తీసుకునే మీరే ఒకటిన్నర కోటి పెట్టి కారు కొన్నప్పుడు కోట్లల్లో.. పారితోషకం తీసుకునే పవన్ కళ్యాణ్ గారు రెండు కోట్లు పెట్టి పది కార్లు కొనలేరా. మీరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో వాళ్లను పొగడటం.. అవతల పార్టీ వాళ్లను తిట్టడం మీకు పరిపాటి మీరేదైతే అన్నారో చవటలు సన్నాసులు దద్దమ్మలని వాళ్లందరితోపాటు అరాచక వాదులు కూడా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

మీ ఎంపీ చేసిన ఘనకార్యం దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది వీక్షించారు. సిగ్గుండాలి మీకు నిజంగా మీది నీతివంతమైన పార్టీ మహిళల పైన గౌరవం ఉన్న పార్టీ అయితే వెంటనే ఆ గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయించండి.. అంతేగాని అనవసరంగా ప్రతిపక్షాలను విమర్శించకండని ఎద్దేవా చేశారు.