కాణిపాకంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, కోవిడ్ నిబందనలు పాటిస్తూ దర్శనానికి అనుమతి

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించాలని దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం 30 వేల మంది భక్తులను మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించుకున్నారు.

ఆలయంలో శానిటైజర్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకునే భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారిని మాత్రం అనుమతించరు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.

అయితే ఉత్సవాలన్నింటినీ ఏకాంతంగానే నిర్వహించనున్నారు. వాహన సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహిస్తారు. ఉత్సవాల ఊరేగింపు, గ్రామోత్సవాలను రద్దు చేశారు దేవస్థానం అధికారులు. 50 మంది ఉభయదారులతో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్సనానికి అనుమతిస్తారు.

మరోవైపు ఆర్టీసీ కూడా కాణిపాకంకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉదయం 4 గంటల నుంచే ప్రయాణీకుల కోసం బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును నడపడానికి ఆర్టీసీ సిద్థమైంది.