శాడిస్ట్ పాలన పోవాలి – శోభాయమాన పాలన రావాలి: ఆళ్ళ హరి

  • శోభకృత ఉగాది నామ పండుగ వేడుకల్లో జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: గత నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న శాడిస్ట్ పాలన పోయి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో శోభాయమాన పాలన రావాలని ఉగాది పర్వదినాన ప్రతీఒక్కరూ భగవంతున్ని ప్రార్ధించాలని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కోరారు. శోభకృత నామ ఉగాది పండుగ సందర్భంగా బుధవారం శ్రీనివాసరావుతోటలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రకృతికి, కాలానికి, ప్రజాభిప్రాయానికి వ్యతిరేక దిశగా పరిపాలన సాగిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఉగాది కల్లా చరమగీతం పాడాలన్నారు. మంచి చెడూ అనేవి మన ఆలోచనలు, చేష్టలను బట్టే మనకు ఎదురవుతాయన్నారు. మంచి ఆలోచనలతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవచ్చన్నారు. శోభకృత నామ ఉగాది ప్రతీ ఒక్కరికీ విజయాలను అందించాలని భగవంతుడుని కోరుకుంటున్నట్లు ఆళ్ళ హరి తెలిపారు.