సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి: రాయపూడి

కృష్ణాజిల్లా, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపైనా, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండిస్తుంది. ఆయన మీడియాలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అభ్యర్థులు కోసం సెప్టిక్ ట్యాంకులో చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు అనీ, అదేవిధంగా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు అనీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రక్క రాష్ట్రాములో నివాసం ఉంటారు అనీ విజ్ఞత లేని మాటలు మాటలాడటం చాలా బాధాకరం. ప్రస్తుతం ఉన్న వైస్సార్సీపీ పార్టీ కుడా ప్రతిపక్షంలో ఉంది అధికారంలోకి వచ్చింది అనీ, అదేవిధంగా మీ వైస్సార్సీపీ పార్టీ కుడా అభ్యర్థులును సెప్టిక్ ట్యాంకులో చేపలు వేట ద్వారా ఎన్నుకున్నారా అనీ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, అదేవిధంగా ప్రతిపక్షలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయి అంటున్నారు. మీ వైస్సార్సీపీ పార్టీ కుడా ప్రతిపక్షంలో నుండి రాజకీయ వ్యభిచారం చేసి అధికారంలోకి వచ్చారా అనే విషయం ప్రజలుకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీ వైస్సార్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రక్క రాష్ట్రంలో ఉంది జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోనే ఉంటారు, అమరావతే రాజధాని అనీ ప్రజలకు ప్రక్క రాష్ట్రంలో ఉంది ప్రజలుకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు పాఠం పడుతూ ప్రజలను అయోమయం చేస్తూనారు. పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలోనూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రజలు సమస్యలు కోసం కృషి చేస్తున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కోటినర్రా ప్రజలు మిమ్ములను నమ్ముతున్నారు, సామాజిక సాధికార యాత్రలు పుల్ సక్సెస్ అనీ,98% నవరత్నాలు అమలు పరిచ్చాము అనీ చెపుతున్నారు. రాష్ట్రంలో మీరు చేసే యాత్రలు తుస్సు యాత్రలు అనీ ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కొన్ని ప్రాంతాలలో జనాలు కుడా లేకుండా వెళవేళ పోయినాయి. మీరు ప్రతిపక్షంలో ఉంది పాదయాత్ర చేస్తూ నవరత్నాలు అనే మాయమాటలు చెప్పి, ఓటు బ్యాంకు రాజకీయం చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మడం త్రిప్పి మాట తప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏడు జాబ్ క్యాలెండరు అన్నారు జాబ్ క్యాలెండరు ఏమి అయింది?, అధికారం లోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. సిపిఎస్ రద్దు చేసారా?, అధికారంలోకి రాగానే మద్యపానం రద్దు అన్నారు. బార్ షాపులు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, మరి నిషేధం ఎప్పుడు చేస్తారు?, డిఎస్సి నోటిఫికేషన్ ఏమి అయింది? ఇసుక పాలసీ ఏమయింది? ప్రస్తుతం ఇసుక సామాన్యులకు దొరకని పరిస్థితి.45 ఏళ్ళు నిండిన ఎస్సి, ఎస్టి, బిసి మహిళలకు పెన్షన్ అన్నారు, ఆ విధానం ఏమి అయింది? ఒక ప్రక్క రాష్ట్రంలో రోడ్డులు సరిగా లేవు, త్రాగడానికి మంచినీళ్లు లేవు, ఈ ఏడు సాగునీరు లేదు, గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు లేవు, పరిశ్రమలు లేవు, సంపద లేదు, రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఊసే లేదు, కనీసం రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రసుత ఆంధ్రప్రదేశ్ అప్పు 11 లక్షల కోట్లు చేసి పుట్టబోయే బిడ్డకు 3 లక్షలు అప్పు భారం పెంచిన మీ వైస్సార్సీపీ పార్టీ, కోటిన్నర మంది ప్రజలు మీకు అండగా ఉన్నారనీ చెప్పుకుంటున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉన్నత విలువులుతో కూడినవిగా ఉండాలి గానీ, హేళనతో ఉండకూడదు. ఇప్పటికయినా పవన్ కళ్యాణ్ విషయంలో గానీ, ప్రతిపక్షాల విషయంలో గానీ విజ్ఞతతో మాట్లాడాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని అన్నారు.