మర్రి శశిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సనత్ నగర్ జనసేన

తెలంగాణ, సనత్ నగర్ నియోజకవర్గంలో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఆహ్వానం మేరకు సనత్ నగర్ జనసేన ఇంచార్జ్ ఎం.కావ్య ముదిరాజ్ జనసైనికులు వీర మహిళలతో కలిసి వారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తన విజయానికి కృషి చేయాలని కోరారు. సనత్ నగర్ జనసేన ఇంచార్జ్ ఎం.కావ్య ముదిరాజ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో ముందుకు వెళుతున్నామని ఆయన ఆదేశాలతో సనత్ నగర్ నియోజకవర్గంలో మర్రి శశిధర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు పద్మజ, భవాని మధు, వినోద్, లోకేష్, రాజేష్ సాహూ, సాయిరాం గౌడ్, విజయ్, లక్ష్మీ సాయి పాల్గొన్నారు.