Hyderabad: జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా బైరి వంశీకృష్ణ

గ్రేటర్ వరంగల్ పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి శ్రీ ఆకుల సుమన్ సూచనల మేరకు పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ కార్యవర్గాన్ని ప్రకటిఇంచిన జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్. గ్రేటర్ వరంగల్ అధ్యక్షునిగా బైరి వంశీకృష్ణను నియమించడం జరిగింది.