రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు

రాజ్ భవన్ లో సాంప్రదాయ బద్దంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ తమిళ సై. ఈ సందర్భంగా పొంగల్ వంటకాన్ని తయారు చేసారు గవర్నర్. పొంగల్ సందర్భంగా చేసే అన్నింటినీ రాజ్ భవన్ ప్రాంగణంలో నిర్వహించారు గవర్నర్. పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన గవర్నర్.. కరోనా వ్యాక్సిన్, ఆత్మనిర్బర్ భారత్ ని ప్రతిభింబించే విధంగా ఉన్న గాలి పటాలను ఎగుర వేసారు గవర్నర్ తమిళ సై. గాలి పటాల పై మా వ్యాక్సిన్-మా ప్రైడ్, మా దేశం-మా వ్యాక్సిన్, మా టీకాలు-సురక్షితమైన వ్యాక్సిన్లు,ఆత్మ నిర్భర్ భారత్ వంటి సందేశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జనవరి 16 న ప్రారంభం కానున్న భారీ టీకా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే కైట్స్ పై సందేశాలు ఉంచారు. ఆత్మ నిర్బర్ భారత్ కి చొరవ చూపిన మోడీ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్ తమిళ సై.