ధూళిపాళ్లలో మనఊరు మనఆట సంక్రాంతి సంబరాలు

  • సత్తెనపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించిన ధూళిపాళ్ల గ్రామ జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు

జనసేన నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు “మన ఊరు మన ఆట” కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాల గ్రామంలో పోలేరమ్మ గుడి వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. ఈ ముగ్గుల పోటీల్లో ధుల్లిపాల్ల గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలను నిర్ణయించే న్యాయ నిర్నితలుగా నియోజకవర్గ జనసేన వీర మహిళలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి విచ్చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా మొదటి బహుమతి అద్దేపల్లి శాంతి, రెండవ బహుమతి కె, చందనా, మూడవ బహుమతి ఎన్న్, వరలక్ష్మీ, నాల్గవ బహుమతి బి అనుషా, ఐదవ బహుమతి శివ శ్రావ్య, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు గారు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి అంటే పట్టణాల నుండి పల్లెటూళ్ళకు పోయి బంధువులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటాం. అమ్మమ్మ చేతి పిండివంటలు, తాతయ్యలు చెప్పే కబుర్లు, కోడిపందాలు, గాలిపటాలు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఇలా చెప్పుకుంటూ పోతే.. అదంతా ఒకప్పటి మాట. పిల్లల చదువుల రీత్యా, ఉద్యోగ, వ్యాపార మరియు వ్యక్తిగత కారణాల దృష్ట్యా పుట్టిన ఊరికి, బంధువులకు మరియు స్నేహితులకు దూరం అవుతున్నాం. ఇలాంటి పండుగల వలన అలాంటి దూరం కొంత తగ్గుతుంది అని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, కామినేని నరసయ్య, లింగీసెట్టి వేంకటేశ్వర్లు, అద్దేపల్లి రామారావు, షేక్ రఫీ, చిలకా పూర్ణ, లింగిసెట్ట బల్లే బ్బయి, లింగిశెట్టి బ్రహ్మయ్య, శ్రీను నాయకులు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.