రాజంపేట జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

రాజంపేట: తెలుగుదేశం, జనసేన అధిష్టానాల పిలుపు మేరకు ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా భోగి సంకల్పం అన్నమయ్య జిల్లా (ఉమ్మడికడపజిల్లా) రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో భోగి పండుగ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ వైసీపీ అరాచకాలు మరియు రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తులు ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ వైసీపీ దుర్మార్గమైన చెత్త పరిపాలన దాష్టికాలన్నీ ఈ భోగిమంటల్లో కలిసిపోయి రాష్ట్రమంతా ప్రజలందరి జీవితాలలో వెలుగాలని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త నూతన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు చూడాలని, ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఉత్తేజం వెలుగులు రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి మలేపాటి దామోదర్ నాయుడు, మండల మైనార్టీ సీనియర్ నాయకులు మేకల మహబూబ్ బాషా, మండల టిడిపి ఉపాధ్యక్షులు ఎర్రం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజా నాయుడు, కొండూరు బలరామరాజు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీల శ్రేణులు కార్యకర్తలు జనసైనికులు స్థానికులు మండల ప్రజలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి భోగి మంటలు సంబరాలు జరుపుకున్నారు.