పిఠాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి రంగోలి పోటీలు

విజేతలకు బహుమతులు అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగలు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తాయి అని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసైనికుల ఆధ్వర్యంలో రంగవల్లులు ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి గారు మాట్లాడుతూ ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ కీ జనసైనికులకు నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ… సంక్రాంతి పండగ ధనుర్మాసం నెల రోజులను ముగ్గుల మాసంగా పిలుస్తూ.. ప్రతి ఇంటా ముగ్గులతో అలంకరిస్తారు అని అన్నారు. అలాగే ఈ సంక్రాంతి అన్నది ప్రతి ఒక్కరికి ఆదర్శమైన పండగ. అలాగే ఇప్పుడున్న పరిస్థితి పెట్టి ఒమిక్రాన్ కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పండగ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అని తెలియజేశారు.అనంతరం ముగ్గులు పోటీలో పాల్గొన్న ఆడపడుచుల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కీర్తి చంటి, వినుకొండ అమ్మాజీ, సిహెచ్ శిరీష, జనసేన పార్టీ గొల్లప్రోలు మండలం అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, పుణ్యంమంత్రుల సూర్యనారాయణ మూర్తి, యాండ్రపు శ్రీనివాస్, మేళం బాబి, సి.హెచ్ నవీన్, జె.వరలక్ష్మి, జె.చక్రవేణి, యూ.శ్రీ లక్ష్మి, వి.సూర్యకాంతం, వీరసత్య, నాగమణి, సాయి, సత్య, రాధా, శివ, చక్కవని, జ్యోతి శివదుర్గ, ఆదిలక్ష్మి, దేవి, దుర్గా, శ్రీలక్ష్మి, వాణి, వీర వెంకటలక్ష్మి, రాధ, వీరలక్ష్మి, పూర్ణశ్రీ, బాబి, కగాయలత, బి నాగమణి, నవ్య, మౌనిక, వీరకుమారి, మహాలక్ష్మి, ప్రదీప్, శివరెడ్డి, జనసేన నాయకులు, వీరమహిళలు మర్యు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.