జిల్లా కలెక్టర్ ని కలిసిన సత్తెనపల్లి విపక్ష నేతలు

సత్తెనపల్లి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల మేరకు ఏర్పాటైన స్వచ్చభారత్ మిషన్ ఆధ్వర్యంలో, కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన “స్వంచ్చంద-స్వచ్చభారత్” అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో చేపడుతున్న మురుగునీరు, వర్షపు నీటిని శుధ్ధిచేసే కర్మాగారం కోసం సేకరిస్తున్న భూమికి సంబందించి జరిగిన భారీ అవకతవకలు గురించి ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గ అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరుకు పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకుల్లో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, జై భీం భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ పాల్గొన్నారు.